పెద్ద ఎడ్గి మూడు అంగన్ వాడి కేంద్రాలలో ఘణంగా తల్లి పాల వారోత్సోవాలు..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఎడ్గి సెక్టార్ లోని అంగన్ వాడి  కేంద్రంలోని టీచర్లు ప్రేమల, యమున, పుష్ప సెంటర్ లలో మంగళవారం నాడు తల్లీ పాల వారోత్సోవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, ఎంపిటిసి సునితా పటేల్ పాల్గోన్నారు. ఈ  సంధర్భంగా బాలింతలకు,  గర్బీణిలకు, తల్లి పాల గురించి టీచర్లు వివరించడం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్, టీచర్ ప్రేమల మాట్లాడుతూ.. తల్లి పాలు ఎంకో శ్రేష్టమైనవి అని, పుట్టగానే శిశువుకు పసుపు పచ్చటి ముర్ర చనుపాలు పెట్టించాలని, పోషక విలువలు కల్లినవి కావడంతో శిశువుకు మెదడు ఎదుగుల, కామేర్లు వంటి వ్యాదులు రాకుండా భవిషత్ లో  కాపాడుతాయని వివరించారు. కార్యక్రమంలో నాయకుడు విజయ్ పటేల్,  ఆరోగ్య సూపర్ వైజర్, ఆశాలు, ఏఎన్ఎం తదితరులు పాల్గోన్నారు.

Spread the love