నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. టీ తాగుతున్న యువతులపై ఓ అల్లరిమూక దాడి చేసింది.వారి దుస్తులు చింపి, అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నెహ్రూ ప్లేస్‌లోని ఓ టీ షాప్ దగ్గర ఇద్దరు యువతులు టీ తాగుతున్నారు. అటు వైపు వెళుతున్న యువకుల గ్యాంగ్ టీ తాగుతున్న యువతులపై అసభ్య కామెంట్లు చేశారు. దీంతో ఓ యువతి ఆగ్రహానికి గురై తగిన రీతిలో వారికి సమాధానం ఇచ్చింది. ఆ యువతి తమపై తిరగబడ్డం అవమానంగా భావించిన యువకులు, మరికొంతమందితో తరలివచ్చి..సదురు అమ్మాయిలపై దాడికి దిగి వారి దుస్తులు చింపేశారు. చుట్టూ చాలా మంది జనం ఉన్నా ఎవ్వరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదని బాధిత యువతులు వాపోయారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో దారుణం..యువతులపై అల్లరిమూక దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



