– నగదు అపహరణ
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేసిన నగదు అపహరించారు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది. మహబూబ్ ఖాన్ (60) పై గుర్తు తెలియని వ్యక్తులు రాడ్ లతో తలపై కోట్టి గాయపర్చారు. అతని వద్ద అల్లుడుకి సంబంధించిన ఆటో అమ్మగా వచ్చిన లక్ష ఎనభై వేల నగదును దొంగిలించారు.వివరాల్లోకి వెళ్లితే.. మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో సహ ఆటో నగర్ గౌసియా మజీద్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు హైద్రాబాద్ కు వివాహంకు వెళ్లగా కుతురు, అల్లుడు ఉండగా, ఉదయం నమాజ్ పూర్తి చేసుకుని వచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు డోర్ కోట్టడంతో తలుపులు తీయగా అగంతకులు ఈ దాడికి పాల్పడి నగధును ఎత్తుకుపోయారు. అగంతకుల దాడిలో గాయపడిన మహబూబ్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. అతనిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మహబూబ్ ఖాన్ వద్ద నగదు ఉన్న విషయం తెలిసిన వారే ఈ దాడి చేసి దోచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.