ఏవైసీఏ అలవోక విజయం

TDCA Under-17 Cricket Tournament– టీడీసీఏ అండర్‌-17 క్రికెట్‌ టోర్నీ
హైదరాబాద్‌: టీడీసీఏ అండర్‌-17 క్రికెట్‌ టోర్నీలో అమెరికన్‌ యూత్‌ క్రికెట్‌ అకాడమీ (ఏవైసీఏ) అలవోక విజయం సాధించింది. తెలంగాణ రూరల్‌ పాంథర్స్‌పై 104 పరుగుల తేడాతో గెలుపొందింది. జాంబ్‌ (57), తనుశ్‌ (41) రాణించగా తొలుత ఏవైసీఏ 50 ఓవర్లలో 9 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఛేదనలో పాంథర్స్‌ 27 ఓవర్లలోనే కుప్పకూలింది. ఏవైసీఏ బౌలర్‌ రిత్విక్‌ (4/19), శ్రేయాన్స్‌ (2/12) మెరవటంతో పాంథర్స్‌ 138 పరుగులకే ఆలౌటైంది. పాంథర్స్‌ బ్యాటర్‌ శాండీ (70) ఒంటరి పోరాటం చేశాడు. మరో మ్యాచ్‌లో రైజర్స్‌ 33.5 ఓవర్లలో 167/10 పరుగులు చేయగా.. వారియర్స్‌ 31.2 ఓవర్లలోనే 168/6తో ఛేదించి 4 వికెట్లతో గెలుపొందింది. అంతకుముందు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర టోర్నమెంట్‌ను ప్రారంభించారు. టీడీసీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love