అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ – ప్రారంభ్ 2k24

నవతెలంగాణ హైదరాబాద్: అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సగర్వంగా ప్రారంభ్ 2k24ని మొదటిసారిగా నిర్వహించింది. సికింద్రాబాద్ బ్రాంచ్లో డిగ్రీ వర్టికల్లో జరిగిన ఈ ఇంట్రా – కాలేజియేట్ ఫెస్ట్ (మొదటి ఎడిషన్) కార్యక్రమం విద్యార్థుల నైపుణ్యాలు, ప్రతిభను పెంపొందించడానికి దోహదపడ్డాయి. ప్రిన్సిపాల్ డా.శ్రీకాంతలహరి సాగి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర గారు, డీన్ డాక్టర్ సుశీల కందూరి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పోటీలు, అద్భుతమైన సరదా కార్యకలాపాలు, కొన్ని రుచికరమైన ఆహారాలతో విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి.
ప్రారంభ్ 2K24 వివిధ ప్రాతాలనుంచి వచ్చిన విద్యార్థులను ఎంతో ఆహ్లాదపరిచింది. ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభ్ 2K24 , 5 రకాల కళా ప్రక్రియలు కలిగి జంట-నగరాలలో అత్యుత్తమమైనవిగా ఉన్న 25 కంటే ఎక్కువ ఈవెంట్లు నిర్వహించారు. స్టార్టప్, డిబేట్, స్టోరీ రైటింగ్, కొలేజ్ మేకింగ్, స్లోగన్ రైటింగ్, ఫేస్ పెయింటింగ్, హస్తకళలు, మార్కెటింగ్, సెల్లింగ్ వంటి అధికారిక కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల ఉన్న ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల నుండి వచ్చిన ఔత్సాహికులు తమ సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు ప్రారంభ్ 2K24 ఒక వేదికగా నిలిచింది. సుమారు 50 కళాశాలల నుండి 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొని, వారి ఊహాత్మక చిత్రణలతో హాజరైన వారికి ఒక మనోహరమైన దృశ్యాన్ని అందించి,ఆకర్షించి కార్యక్రమానికి అదనపు ఉత్సాహాన్ని జోడించింది.
వివిధ కార్యకలాపాలలో నిమగ్నమై, గానం మరియు నృత్యం, ఫన్ జోన్ గేమ్, మొదలైన సాంస్కృతిక పోటీలు, (స్కేరీ హౌస్) భయానక ఇంట్లో కనిపించని కళ్లతో చూడబడుతున్న కొంత వింత అనుభూతిని చూశారు. విద్యార్ధిని, విద్యార్థులకు విడివిడిగా ఏర్పాటు చేసిన డీజే రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంతలహరి సాగి ఈ సందర్భంగా తన ఆనందాన్ని తెలియజేస్తూ, “ప్రారంభ్ 2K24 అనేది వినూత్నత ప్రయత్నాల అద్భుతమైన పండుగ అని”, సమగ్ర విద్యార్థి అభివృద్ధి కోసం సంస్థ అందించే స్ఫూర్తిని, సంస్ధ అంకితభావాన్ని ఆమె గుర్తుచేశారు. అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర గారు హాజరై ఈ వేడుక గౌరవాన్ని మరింత పెంచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బ్రహ్మదేవర సమన్వయకర్తలు, సభ్యుల బాధ్యతను, సృజనాత్మకతను ప్రశంసించారు. డీన్ డాక్టర్. సుశీల కందూరి ఈ ఆలోచనలను ప్రతిధ్వనించి ప్రారంభ్ 2K24 యొక్క అర్ధాన్ని ఎత్తి చూపారు. అయితే విజయాలు, అపజయాలు పక్కన పెడితే, కాలేజీ ఫెస్టివల్స్ అంటే ఈ క్షణంలో జీవించడం, మిమ్మల్ని మీరు ఆస్వాదించడం, కాలేజీ రోజుల తర్వాత చాలా కాలం పాటు గుర్తుండే అనుభవాలను సృష్టించడం అని ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ సందర్బంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మొమెంటోలు, నగదు బహుమతులతో సత్కరించారు.

Spread the love