Wednesday, June 3, 2026
E-PAPER
Homeజిల్లాలుఅటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన బైక్ ర్యాలీ

అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన బైక్ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో బుధవారం అటవీ శాఖ కార్యాలయ సిబ్బంది ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ వారసవ కార్యక్రమాలను అటవీ రేంజ్ అధికారి అనిత ప్రారంభించారు.హరిత తెలంగాణ – స్వచ్ఛమైన పర్యావరణం – ఆరోగ్యకరమైన భవిష్యత్తు అనే నినాదంతో అటవీశాఖ కార్యాలయం నుండి జాతీయ రహదారి మీదుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పర్యావరణం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారి అనిత మాట్లాడుతూ అడవులను కాపాడడం మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనుమతులు లేకుండా చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, భీంగల్ డిప్యూటీ రేంజ్ అధికారి సిద్ధార్థ, కోనాపూర్ అటవీ సెక్షన్ అధికారి బాపూరావు, భీమ్ నగర్ అటవీ సెక్షన్ అధికారి రాజేందర్, రేంజ్ పరిధిలోని బీట్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -