ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బంటు కవిరాజు
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్లాస్టిక్ నిర్మూలనలో యువత కీలకపాత్ర వహించి పర్యావరణ సుస్థిరత సాధించాలని కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బంటు కవిరాజు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, నెల్లికుదురులో కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) మరియు జాతీయ సేవా పథకం (NSS) సంయుక్త ఆధ్వర్యంలో “ప్లాస్టిక్ నిర్మూలన – పర్యావరణ సుస్థిరత సాధించడంలో యువత పాత్ర” అనే అంశంపై బుధవారం వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బంటు కవిరాజు, కాలుష్య నియంత్రణ మండలి మహబూబాద్ నోడల్ ఆఫీసర్ మాలోత్ సుభాష్ లు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలని సూచించారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం ఎన్ ఎస్ ఎస జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారిందని, పర్యావరణ సుస్థిరత సాధనలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. విద్యార్థులు తమ కుటుంబాలు, గ్రామాలు మరియు సమాజంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ మరియు ఉపన్యాస పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. వెంకటేశ్వర్లు, ఎన్జిసి రిసోర్స్ పర్సన్ హాట్కర్ సూర్యకిరణ్, అధ్యాపకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్, రామ్మూర్తి, సుధాకర్, మహేందర్, రఘురాం, బాబు, యాకన్న, సుభాష్ అధ్యాపకేతర బృందం శ్రావణ్, ప్రదీప్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.



