మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై అవగాహన సదస్సు..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గురువారం మాన్సూన్ యాక్షన్ ప్లాన్, సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల అధ్యక్షతన ఈ  అవగాహన సదస్సును నిర్వహించారు. మండలంలోని నాగపూర్, కమ్మర్ పల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం ఆరంభమైనందున సీజనల్ వ్యాధులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించి గ్రామాలను పరిశుభ్రత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులతో ఎప్పటికప్పుడు మురికి కాలువలు శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ తో సానిటేషన్ చేయించాలన్నారు.ప్రజలు చెత్తాచెదారం మురికి కాలువలో వేయకుండా శుభ్రంగా ఉండేలా పంచాయతీ సిబ్బందికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. గ్రామాల్లోని వాటర్ ట్యాంకులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి శానిటేషన్ చేయాలన్నారు. గ్రామాల్లో పైపులు ఎందుకు కేజీలు ఉంటే తక్షణమే వాటికి మరమ్మత్తులు చేయించాలన్నారు.ఈ కార్యక్రమాల్లో  తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి సదానంద్,  ఆయా గ్రామాల పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love