సైబర్ నేరాలపై  పోలీస్ కళాబృందం  అవగాహన

నవతెలంగాణ -పెద్దకొడప్ గల్

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ఆవరణలో మరియు బస్టాండ్ ఆవరణలో స్థానిక ఎస్సై కోన రెడ్డి మరియు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రజలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఉచితలకు ఆశతో మోసపోవద్దని ఈమెయిల్ లేదా మెసేజ్ లో సామాజిక మధ్యమాలలో ప్రకటన కనిపించిన జాగ్రత్తపడండి అని బ్యాంకులో ఎటువంటి అత్యవసర మార్గాన్ని సృష్టించి మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసగిస్తారని గుర్తించాలని అన్నారు. పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం కోసం క్రింది లింకును క్లిక్ చేయండి ఇలాంటి మెసేజ్లను ఎవరు కూడా స్పందించకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు తాత్కాలిక వెబ్ సోషల్ మీడియా పోస్టులు చాలాసార్లు నిజమైన వ్యాపార సంస్థలను పోలి ఉంటాయని ఇలాంటి విషయాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కస్టమర్ కేర్ నెంబర్ గూగుల్ లో వెతక వద్దు, మీకు లాటరీలు తగిలినాయి అని మీకు లోన్స్ వస్తాయని తక్కువ ధరలకే ఆన్లైన్లో వస్తువులు వస్తాయని ఇలా అనేక రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అపరిచిత వ్యక్తుల నుండి కాల్స్ వచ్చినప్పుడు వారి నుండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆటోలలో ప్రయాణించినప్పుడు నెమ్మదిగా వెళ్లాలని పరిమితికి మించి ప్రయాణికులను నింపరాదని సూచించారు. సెల్ ఫోన్లు పోయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కోనారెడ్డి, ఏఎస్ఐ రాములు, కళాబృంద సిబ్బంది శేష రావు,సాయిలు, రవి, పోలీస్ సిబ్బంది సాయి శివ, అంజి పాల్గొన్నారు.

Spread the love