Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సై ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన

ఎస్సై ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జుక్కల్ ఎస్సై బి. మురళీ ఆధ్వర్యంలో పోలీసు బృందం  సైబర్ నేరాల గురించి గ్రామ సర్పంచ్ తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ.. గ్రామాలలో మోబైల్ ఫోన్ లలో లింకులు నోక్కండి, ఓపేన్ చేయడం వలన సైబర్ నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తానని తెలిపారు. ఫోన్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బ్యాంకు ఖాతా నెంబర్లు, పిన్ నెంబర్లు, ఆధార్ పంపించాలని అడిగితే వివరాలు చెప్పొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను తక్కువగా వాడాలని, అవసరం ఉంటే తప్ప అనవసర విషయాలలో తల దూర్చడం వలన సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని అన్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను ఫైబర్ నేరగాళ్లు కాళీ చేస్తే వెంటనే అప్రమత్తమై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -