Saturday, June 20, 2026
E-PAPER
Homeజిల్లాలుయూరియా బుకింగ్ యూప్ పై అవగాహన

యూరియా బుకింగ్ యూప్ పై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూరు రైతు వేదిక భవనంలో శనివారం  మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ  సమక్షంలో రైతులకు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవడంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఫర్టిలైజర్ యాప్ లో యూరియా బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో ప్రొజెక్టర్ లో రైతులకు చూపిస్తూ వ్యవసాయ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా సులభంగా యూరియా బుకింగ్ చేసుకునే విధానం గురించి రైతులకు వివరించారు.

అనంతరం మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండలంలోని ఆయా సింగల్ విండో గోదాంలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉప్లూర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -