ముద్ర రుణాలపై అవగాహన సదస్సు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామ శివారులోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ అర్ఎస్ఈటిఐ లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముద్ర రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎస్బిఐ అర్ అర్ ఓ సిఎం క్రెడిట్ రవికుమార్,ఎల్ డి ఎం నిజామాబాద్ శ్రీనివాస రావు లు పాల్గొని మాట్లాడుతూ ముద్రా రుణాలకు ఎవరు  అర్హులు ? ఎంత వరకు రుణాలు తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలను ఎప్పుడు కట్టాలి.తము చేస్తూన్న వ్యాపారం లో వృద్ధి ఎలా సాధించాలనే దానిపై అవగాహన కల్గి ఉండాలని, బ్యాంకు లో నుండి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ తమ కుటుంబాలను అన్నివిధాల తోడుగా ఉండే విధంగా చూడాలని సూచించారు.అంతకు ముందు ఎల్ డిఎం శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ద్విచక్ర వాహనం శిక్షణ ను ప్రారంభించారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించు కొని ఫ్యాకల్టీలు భాగ్యలక్ష్మి, ముస్తాక్, షకీల్, రఘుదీప్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్ఎస్ఈటిఐ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది రామకృష్ణ ,ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love