జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడానికి అవగాహన సదస్సు

నవతెలంగాణ-బేగంపేట్‌
జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడానికి జీహెచ్‌ ఎస్‌పీసీఏ అధ్వర్యంలో సికిం ద్రాబాద్‌, సింది కాలనీలోని జైన్‌ మందిర్‌ లో అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు, జంతు ప్రేమికులు పాల్గొని తమ అముల్యమైన సలహాలు, సూచనలు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తీర్థ్‌ సుందర్‌ మహారాజు మాట్లాడుతూ జంతువులను కూడా తమలాగే జీవులుగా పరిగణించి వాటిపై ప్రేమను చూపాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జంతు పరిరక్షణ సంస్థ సలహాదారు మహిప్‌జైన్‌ మాట్లాడుతూ మూగ జీవాల పరిరక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్క రూ ముందుకు రావాలని కోరారు. దాహం, ఆకలి అని పశుపక్ష్యాదులు అడగలేవని వాటికి మన వంతు కర్త వ్యం గా ఆహారం, నీరు కల్పించాలన్నారు. తమ సంస్థ ఆధ్వ ర్యంలో త్వరలో హైదరాబాద్‌లో మూగ జీవాలకు వైద్య సహాయం అందించడం కోసం అత్యాధునిక యంత్ర పరిక రాలతో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. దీని నిర్మాణం కోసం పీపుల్స్‌ఫర్‌ అనిమల్‌ సంస్థ చైర్మెన్‌ మే నకా గాంధీ హైదరాబాద్‌ లో 550గజాల స్థలం కేటాయిం చారని పేర్కొన్నారు. ఈ స్థలంలోనే హాస్పిటల్‌ నిర్మాణం చేపట్టి అన్ని జీవాలకు ఉచితంగా వైద్య సహాయం, చికి త్సలు అందించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ లో అక్రమంగా తరలిస్తున్న 10ఒంటెలను గుర్తించి అసిఫ్‌ నగర్‌ పీఎస్‌లో ఫిిర్యాదు చేయడంతో పాటు కోర్టు ఆదే శాల ప్రకారం రాజస్థాన్‌లోని మహావీర్‌ కామెల్‌ సం చూ రికి తరలించినట్లు మహిప్‌జైన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు సభ్యు లు గిరీష్‌ శా, ప్రముఖ నటుడు అశోక్‌కుమార్‌, అధ్య క్షుడు దినేష్‌ అంచాలియ, వ్యవ స్థాపక కార్యదర్శి సురే ందర్‌ బండారి, కోశాధికారి జోషి, సమన్వయ కర్త సౌధర్మ్‌ బండారి, పశువైద్యుడు డా. విశ్వ చైతన్య పాల్గొన్నారు.

Spread the love