బాబుజగ్జీవన్ రాం బాటలో నడవాలి: సరికెల పోశేట్టి

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
బాబు జగజీవన్ రామ్ బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జి సరికెల పోశెట్టి అన్నారు. శుక్రవారం నగరంలోని రైల్వే కామన్ దగ్గర గల స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్నికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన్ టౌన్, ఎంఆర్పిఎస్ అధక్షలు మహేష్, జిల్లా ఉపధ్యక్షలు రోడ ప్రవీణ్ మాదిగ, నాగరం బస్తీ అధ్యక్షులు సిలం యాదగిరి మాదిగ, మహిళా సమాఖ్య నాయకులు యమున మాదిగ, గొనె మారుతి, అకరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love