నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ మండలంలోని ఎంపిపీఎస్, ఎంపియూపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో బడి – బాట కార్యక్రమం నిర్వహించారు. లాడేగాం ఎంపి యూపీఏస్ హెచ్ఎం మశ్రత్ , పడంపల్లి హెచ్ ఎం జగదీశ్, లొంగన్ హెచ్ఎం అఫ్రోజ్ , బిజ్జల్ వాడి హెచ్ఎం రవికుమార్, గుల్ల తాండ హెచ్ఎం అఖిల, దోస్తు పల్లి హెచ్ఎం శంకర్, బంగారు పల్లి హెచ్ఎం రాజేంద్రప్ప, శక్తి నగర్ హెచ్ఎం విజయలక్ష్మి, మైలార్ హెచ్ఎం, సవర్గావ్ హెచ్ఎం సాయిలు, సావర్ గౌడ్ తండా హెచ్ఎం రేచల్ రాణి, జుక్కల్ ఎస్సీ కాలనీ హెచ్ఎం అఖిల, కంటాలి హెచ్ఎం సంతోష్ , చండేగావ్ హెచ్ఎం మౌనిక , హంగర్గ హెచ్ఎం స్వరూప, కత్తల్ వాడి హెచ్ఎం జ్యోతి, వజ్రఖండి హెచ్ఎం బాబు, కంఠాలి తండా హెచ్ఎం మౌనిక, పెద్దగుల్ల ఉర్దూ మీడియం హెచ్ఎం సబీనా బేగం, పెద్ద గుల్ల తెలుగు మీడియం హెచ్ఎం చంద్రకళ, బస్వాపూర్ హెచ్ఎం జై చంద్, ఖండేబల్లూర్ హెచ్ఎం జైల్ సింగ్, జుక్కల్ అంజలి, కేమ్రాజ్ కల్లాలి హెచ్ఎం రాఘవేందర్, మహ్మదాబాద్ హెచ్ఎం గోపాల్, చిన్న ఏడ్గి హెచ్ఎం భారతి, ఏడ్గి తాండా హెచ్ఎం గంగారం, చుక్క జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం హనుమంత రెడ్డి,, ఖండేబల్లూర్ జడ్పిహెచ్ఎస్ హెచ్ఎం లాలయ్య, పెద్ద ఏడ్గి జెడ్పిహెచ్ఎస్ఎం తిరుపతయ్య, ఎంపీ యుపిఎస్ హెచ్ఎం నాగుల్ గౌడ్ అశోక్, బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పుస్తకాలు నోటుబుక్కులు, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్ లు, నాణ్యమైన విద్య నిష్టాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేయడం, జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలని ప్రైవేటు పాఠశాలలకు పంపించి ఆర్థిక నష్టం, అప్పుల పాలు చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామపంచాయతీ కార్యదర్శులు, జిపిఓలు, తదితరులు పాల్గొన్నారు.



