నవతెలంగాణ-అచ్చంపేట
ప్రధాన సంఘ సంస్కర్త, మాజీ మంత్రివర్యులు, దివంగత నేత పుట్టపాక మహేంద్ర నాథ్ 100వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం అచ్చంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ క్రమంలో మహేంద్రనాథ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. విద్య, వైద్యం, వ్యవసాయం మూడు రంగాలపైన తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సందర్భంలో మహేంద్రనాథ్ దళిత వర్గాలకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, ప్రజాసేవ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పిన గొప్ప వ్యక్తి మహేందర్ నాదని సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు.
ఘనంగా మాజీ మంత్రి మహేంద్ర నాథ్ శత జయంతి ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



