Thursday, May 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబక్రీద్ పండుగ.. కీల‌క మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

బక్రీద్ పండుగ.. కీల‌క మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బక్రీద్ పండుగ నేపథ్యంలో న‌గ‌రంలోని కీల‌క మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు.వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు. 2026 మే 27, 28 తేదీల్లో సాయంత్రం 5:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ప్రయాణికులు తాజా సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలను గమనించాలని, అత్యవసర సమయాల్లో 9010203626 నంబర్​ను సంప్రదించాలని అధికారులు కోరారు.

రాయదుర్గం, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వాహనదారులు.. షేక్​పేట ఫ్లైఓవర్ కింద నుంచి ఫిల్మ్ నగర్ రోడ్డు ద్వారా లేదా ఫ్లైఓవర్ ర్యాంప్ దాటిన తర్వాత బృందావన్ కాలనీ మీదుగా వెళ్లాలి.

లక్డీకాపూల్ నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వెళ్లే వారు మాసాబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద కుడి వైపునకు తిరిగి, బంజారాహిల్స్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి.

మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వాహనాలు నానల్ నగర్ జంక్షన్ వద్ద ఎడమ వైపునకు తిరిగి, లంగర్ హౌస్ – నార్సింగి రోడ్డు మీదుగా ప్రయాణించాలి.

మాసాబ్ ట్యాంక్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లే వారు పీవీఎన్ఆర్ ఎక్స్​ప్రెస్​వే పిల్లర్ నంబర్ 2, 3 వద్ద ఎడమ మలుపు తీసుకుని, మిరాజ్ కేఫ్ – గుడిమల్కాపూర్ మార్గం ద్వారా వెళ్లాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -