నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మినీ స్టేడియంలో గత రెండు రోజుల నుండి బాలక్ రామ బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 నిర్వహించినారు. కెప్టెన్ సుధీర్ శర్మ,వైస్ కెప్టెన్ భార్గవ్ లు వ్యవహరించినారు . బాసర నిజామాబాద్ జగిత్యాల ఆర్మూర్ ఖానాపూర్ పట్టణాలలోని వివిధ టీమ్ లు పాల్గొన్నవి ఈ సందర్భంగా కెప్టెన్ సుదీర్ శర్మ గురువారం మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికై క్రికెట్ టోర్ను నిర్వహించడం జరిగిందని ఇకముందు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.. ఈ క్రికెట్ టోర్నమెంట్ జగిత్యాల జట్టుపై ఆర్మూర్ జట్టు విజయం సాధించింది భారతి నృత్య నికేతన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఆ భినయ్, పవన్ జోషి ,మణి కృష్ణ , రిషికేష్ దీపక్, శివ, రాజేశ్వర శర్మ, వినోద్, జోషి ,దీక్షిత్ ,శివరామకృష్ణ, రిషికేష్ తదితరులు పాల్గొన్నారు.