ఇటలీ ప్రధాని మెలోని కీలక ప్రకటన
లింగ సమానత్వం అనేది రాజీపడలేనిదని వెల్లడి
రోమ్ : పాఠశాలల్లో బుర్ఖాలు, నిఖాబ్‌ల వంటి ముఖాన్ని కప్పుకునే వస్త్రాలను నిషేధించే ప్రణాళికలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించారు. అలాగే ప్రతి తరగతి గదిలో అనుమతించే విదేశీ విద్యార్థుల సంఖ్యపై చట్టపరమైన పరిమితిని కూడా ఆమె ప్రతిపా దించారు. ఆదివారం రోమ్‌లో తమ పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మెలోని ఈ ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత నిబంధ నలతో కూడిన ఒక బిల్లును త్వరలో మంత్రివర్గ మండలికి సమర్పిస్తామని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ముఖానికి మాస్కులు ధరించడంపై ప్రతిపాదిత నిషేధం గురించి మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ముఖానికి మాస్కులు ధరించకుండానే పాఠశాలకు హాజరు కావా లని పిలుపునిచ్చారు. ఈ చర్యను లింగ సమానత్వంతో ముడిపెట్టారు. దేశ వీధుల్లోనైనా, పాఠశాలల్లోనైనా లింగ సమానత్వం అనేది రాజీపడలేని అంశమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇటలీకి వచ్చే ప్రజలు ఇటాలియన్ భాషను నేర్చుకోవడం, దేశ సంస్కృతిని అర్థం చేసుకోవడం, దాని నియమాలను గౌరవించడం వంటి వాటిని నిర్ధరించడమే ఈ చర్యల లక్ష్యమని అన్నారు.
“మా దృష్టిలో ఇటలీకి వచ్చి ఇక్కడ తమ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఇటాలియన్ భాషను నేర్చుకోవాల్సిందే. మా సంస్కృతిని తెలుసుకోవాలి. మా నియమాలను గౌరవించాలి. ప్రజలను స్వాగతించడానికి ఇదే ఏకైక గంభీరమైన మార్గం. ప్రతి తరగతి గదిలో అనుమతించే విదేశీ విద్యార్థుల సంఖ్యపై చట్టపరమైన పరిమితిని విధించే ఒక బిల్లు మంత్రివర్గ మండలికి చేరబోతోంది. విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటాలియన్ భాష నేర్చుకోవాలనే నిబంధనను ఈ బిల్లులో పొందుపర్చాం. అలాగే పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్‌లపై నిషేధాన్ని ఈ బిల్లు విధిస్తుంది. అమ్మాయిలు ముఖానికి మాస్కు లేకుండానే పాఠశాలకు వెళ్లాలి. సంప్రదాయం పేరిట యువతులను తమ ముఖాన్ని కప్పుకోమని చెప్పే హక్కు ఎవరికీ లేదు.” అని జార్జియా మెలోని తెలిపారు.
పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్‌లపై నిషేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



