ఎన్టీఏ విజ్ఞప్తితో కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను వారం రోజులపాటు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో మంగళవారం నుంచి ఈ నెల 22 వరకూ నిషేధం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విజ్ఞప్తితో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ (యూజీ) 2026 పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి. ఈ పరీక్షను ఈ నెల 22న మరోసారి నిర్వహిం చనున్నారు. ఈ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను మోసం చేయడానికి టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ను మోసపూరిత ముఠాలు ఉపయోగిం చుకుంటున్నాయని ఎన్టీఏ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అనేక టెలిగ్రామ్ గ్రూపుల్లో నకిలీ పరీక్ష పత్రాల గురించి ప్రచారం చేస్తూ, వాటి కోసం డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులను మోసం చేస్తున్నాయని ఎన్‌టిఎ తెలిపింది. ఈ యాప్‌ను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంతటి భారీ స్థాయిలో పనిచేస్తున్న ఒక మెసేజింగ్ యాప్‌ను ఒక పరిమిత కాలానికైనా సరే, భారత్‌లో నిషేధించడం ఇదే మొదటిసారి. ఈ నెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను భారత్‌లో డిసేబుల్ చేయాలని టెలిగ్రామ్‌ను కేంద్రం ఆదేశించింది. టైమ్‌స్టాంప్‌ను అలాగే ఉంచుతూ గతంలో పోస్ట్ చేసిన మెసేజ్‌లను సవరించడంతోపాటు, పేపర్ లీక్ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు నిందితులు ఈ ఫీచర్‌ను దుర్వినియోగ పరుస్తున్నట్టు కేంద్రానికి ఎన్టీఏ ఫిర్యాదు చేసింది. తమకు ప్రశ్నాపత్రం యాక్సెస్ ఉందని మోసపూరిత ప్రచారం చేస్తోన్న అనేక ఛానళ్లు, గ్రూప్‌లు, బాట్‌లను అధికారులు ఇంతకు ముందే తొలగించారు. తాజా నిర్ణయంతో చట్టబద్ధమైన యూజర్లకు అసౌకర్యం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో అత్యంత కీలమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నామని కేంద్రం పేర్కొంది.
వారం రోజులపాటు టెలిగ్రామ్ యాప్‌పై నిషేధం
- Advertisement -
- Advertisement -



