Wednesday, June 17, 2026
E-PAPER
Homeక్రైమ్సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

- Advertisement -

బీహార్ నుంచి అన్న వద్దకు
వచ్చిన తమ్ముడు
కరీంనగర్‌ ‌జిల్లా చొప్పదండిలో ఘటన


సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య నవతెలంగాణ – చొప్పదండి
రైస్‌ ‌మిల్లులో పనిచేస్తున్న అన్న దగ్గరకు వచ్చిన బీహార్‌ ‌యువకున్ని తిరిగి స్వగ్రామానికి వెళ్లే సమయంలో.. తనకు అన్న ​సె‌ల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ ‌జిల్లా చొప్పదండిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం అరలియా జిల్లాకు చెందిన నితీష్ కుమార్‌కు ఐదుగురు అన్నదమ్ములు. అందులో చిన్నవాడు నితీష్. పెద్ద అన్నయ్య కామారెడ్డిలో రైస్ మిల్‌లో పనిచేస్తున్నాడు. బీహార్ నుంచి ఓ వ్యక్తి కామారెడ్డికి వస్తుండగా నితీష్‌ అతనితోపాటు 10రోజుల కిందట పెద్ద అన్నయ్య దగ్గరకు వచ్చాడు. స్మార్ట్ ఫోన్ కావాలని, అందుకు రూ.10వేల నుంచి 15వేలు అవుతాయని అన్నయ్యను అడిగాడు. ప్రస్తుతం డబ్బులు లేవని, సర్దుబాటు అవ్వగానే కొనిస్తానని పెద్ద అన్నయ్య సర్ది చెప్పాడు. తిరిగి నితీష్ ను బీహార్ పంపేందుకు తోడు ఎవరూ లేకపోవడంతో చొప్పదండిలోని హరిప్రియ రైస్‌‌మిల్‌‌లో పనిచేస్తున్న నాలుగో అన్న దగ్గరికి పంపించాడు. అక్కడి నుంచి బీహార్‌ వెళ్లేవారు ఉండటంతో ఈ నెల 13న నితీష్‌ చొప్పదండి‌కి వచ్చాడు. మంగళవారం బీహార్‌కు వెళ్లే వాళ్లతో కలిసి తమ్ముడిని పంపించే ఏర్పాటు చేశారు. కానీ అన్నలు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన నితీష్‌ సోమవారం రాత్రి హమాలీ రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -