Tuesday, May 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి

బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి

- Advertisement -

– లైంగికదాడులు చేయడమే బీజేపీ భేటీ బచావో నా?
– బండి సంజరును మంత్రి పదవి నుంచి బర్త్తరఫ్‌ చేయాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు
– బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్‌ వద్ద నిరసన
నవతెలంగాణ – ముషీరాబాద్‌

బాలికకు మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు బండి సాయి భగీరథను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే బాధిత కుటుంబంపై తప్పుడు కేసు పెట్టించిన కేంద్ర మంత్రి బండి సంజరును తక్షణమే భర్తరఫ్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్‌ వద్ద సోమవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితు రాలి ఫిర్యాదును స్వీకరించడంలో పోలీసులు 8గంటలు ఆలస్యం చేయడంతో వారి వైఖరి ఏమిటో అర్థం అవుతున్నదన్నారు. చట్టం ముందు అందరూ సమా నులే అనేవిధంగా రాజ్యాంగబద్ధంగా పోలీసులు వ్యవహరించాలని సూచించారు. బండి సాయి భగీరథ్‌ తన తండ్రి అండతో విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌, దాడులు, మద్యం మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. బాలికపై లైంగికదాడి చేయడమే కాకుండా తమను హనీట్రాప్‌ చేశారని కేసులు పెట్టి తప్పుదోవ పట్టించడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు.
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లా డుతూ భేటి బచావో భేటి పడావో వంటి అనేక నినాదాలు ఇస్తున్న బీజేపీ సంస్కారం.. రేపిస్టులకు సత్కారాలు చేయటంతోనే బయటపడిందని, మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో చాటుకుందని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజరు తన పదవిని ఉపయోగించి కేసును ప్రభావితం చేసే యత్నం చేస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్నారనే సమాచారం కూడా వెలుగులోకి వస్తోందన్నారు. బాలికకు ప్రాణహాని పొంచి ఉందని, తక్షణమే సాయి భగీరథను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వివిధ ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కేవీపీఎస్‌ మేడ్చల్‌ హైదరాబాద్‌ జిల్లాల కార్యదర్శులు ఎన్‌.బాలపీరు, బి.సుబ్బారావు, ప్రజా సంఘాల నాయకులు ఎన్‌.సోమయ్య, కల్లూరి రమేష్‌, శంకర్‌, ఇందిర, రజిత, బ్రాహ్మని, నవీన్‌, ఆంజనేయులు, రవి, రాజు భగత్‌ సిద్దార్థ, రాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -