Tuesday, May 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ప్రజావాణి'కి పోటెత్తిన అర్జీదారులు

‘ప్రజావాణి’కి పోటెత్తిన అర్జీదారులు

- Advertisement -

– ఉమ్మడి వరంగల్‌లో తీరని ధరణి కష్టాలు.. అందని ఆసరా పింఛన్లు
– ధాన్యం సేకరణలో లారీల కొరతపై రైతన్నల ఆవేదన
– ఇందిరమ్మ ఇండ్లు, గిరి వికాసం కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ-వరంగల్‌ డెస్క్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమాలు బాధితు లతో కిక్కిరిసిపోయా యి. భూ సమస్యలు మొదలుకొని, ఇందిర మ్మ ఇండ్ల్ల మంజూరు, పెన్షన్ల వరకు వివిధ విన్నపాలతో అర్జీదారులు కలెక్టరేట్లకు తరలివచ్చారు. అధికారుల చుట్టూ తిరుగు తున్నా తమ సమస్యలు పరిష్కా రం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో భూ సంబంధిత సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ములుగు జిల్లాలో అందిన 67 దరఖాస్తుల్లో 21 కేవలం భూ సమస్యలే కావడం గమనార్హం. మంగపేట మండలం మల్లూరులో పోడు పట్టాల కోసం గిరిజ నులు ఏండ్ల తరబడి ఎదు రు చూస్తున్నా, గ్రామ సభలు ఆమోదించినా పట్టాలు చేతికం దడం లేదని వాపోయారు. మహబూ బాబాద్‌లోనూ అత్యధికంగా 58 రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులు అందాయి. అలాగే, జనగామ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లింగాల గణపురం మండలం మాణిక్యా పురం రైతులు కలెక్టరేట్‌ మెట్లెక్కారు. ‘కాంటాలు జరుగు తున్నాయి కానీ లారీలు రావడం లేదు. మిల్లుల వద్ద అన్‌ లోడింగ్‌ ఆలస్యం కావడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి’ అని సర్పంచ్‌ విజయ భాస్కర్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణం మారుతున్న దృష్ట్యా వెంటనే లారీలను పంపాలని వారు కోరారు. జనగామ జిల్లా సంజరు నగర్‌కు చెందిన వీరస్వామి అనే వృద్ధుడు తనకు 40శాతం వైకల్యం ఉన్నా పింఛను అందడం లేదని, కంటిచూపు మందగించి కూలి పని చేయలేకపోతు న్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక పరిస్థితి బాగోలేని యువకులు స్వయం ఉపాధి కింద ఎలక్ట్రిక్‌ వాహనాలు మంజూరు చేయాలని ములుగు, జనగామ జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్నారు. నిలువ నీడ లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తమకు ప్రాధాన్యత ఇవ్వాలని భారీగా దరఖాస్తులు సమర్పించారు. అర్జీలను స్వీకరించిన కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు ఆయా శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ‘గిరి వికాస్‌’ బోర్ల మంజూరు, పోడు పట్టాల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ సూచించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఒక్క రోజే వందలాది దరఖాస్తులు రావడంతో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంపై సామాన్యుడు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నాడు.

జిల్లాల వారీగా ప్రధాన సమస్యలు.. దరఖాస్తులు
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో 133 దరఖాస్తులు వచ్చాయి. ఆలాగే 23 డివిజన్లలోనూ ఎక్కువ మొత్తంలో అర్జీలు పెట్టుకున్నారు. ఇందులో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ, డబుల్‌ బెడ్రూమ్‌ సమస్యలు ఉన్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా 67 దరఖాస్తులు రాగా ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్లు, గిరి వికాస్‌, పోడు పట్టాల సమస్యలు ఉన్నాయి. జనగామ జిల్లాలో దాదాపు 50 దరఖాస్తులు రాగా ధాన్యం కొనుగోలు (లారీలు), వికలాంగుల పింఛన్లు, స్వయం ఉపాధి వంటివి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. హనుమకొండ జిల్లాలో దాదాపు 100 నుంచి 150వరకు అర్జీలు రాగా భూ కబ్జాలు, మున్సిపల్‌ సమస్యలు, డ్రయినేజీ సమస్యలు అధికంగా ఉండటం గమనార్హం. వరంగల్‌ జిల్లాలో దాదాపు 120 నుంచి 160 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఇందులో ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్లు, ఆసరా తదితరవి ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో అధికంగా సింగరేణి భూ సమస్యలు, పోడు భూములు, పెన్షన్లుకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి.

బాధితుల ప్రధాన డిమాండ్లు ఇవే..
అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం అందజేయాలని, గతంలో ఆగిపో యిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను పూర్తి చేయాలని కోరుతు న్నారు. అలాగే, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను పెంచి, వెంటనే మిల్లులకు తరలించాలని, లింగాల గణపురం వంటి మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాలని కోరుతున్నారు. ధరణి పోర్టల్‌లో సాంకేతిక లోపాలు, నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు వంటివి ఇంకా పెం డింగ్‌లోనే ఉన్నాయని వాపోయారు. ఎలక్ట్రిక్‌ వాహ నాల మంజూరు, స్వయం ఉపాధి పథకాల కింద లోన్లు ఇవ్వాలని నిరుద్యోగ యువత వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -