Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూఢనమ్మకాలకు సీఎం ప్రోత్సాహం

మూఢనమ్మకాలకు సీఎం ప్రోత్సాహం

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
​సీఎం రేవంత్‌‌రెడ్డి వరుణయాగం పేరుతో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌‌లో శనివారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శ వర్గ సభ్యులు చిన్న పాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు పడక కరువు ఛాయలు అలుముకుంటే అందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన సీఎం రేవంత్‌‌రెడ్డి వరుణయాగాల పేరుతో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. రైతాంగం కరువు బారిన పడకుండా ఆదుకోవాలని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారిఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, కొండేటి శ్రీను, కంబాలపల్లి ఆనంద్, మల్లం మహేష్, వరలక్ష్మి పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -