– నేపాల్ సాహు గ్యాంగ్ పనేనని పోలీసుల ప్రాథమిక అంచనా..
– జైల్లోనే స్కెచ్ వేసినట్టు సమాచారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక సూత్రధారి కల్పనతోపాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు మాత్రం అరెస్టును ధ్రువీకరించలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ విశ్రాంత ఐపీఎస్ అధికారి వినరు రంజన్‌రే సతీమణి తనూజ గత గురువారం తెల్లారుజామున దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. తనూజ నోట్లో గుడ్డలు కుక్కిన దుండగులు ఊపిరాడకుండా చేసి హత్యచేశారు. అనంతరం ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్న ఈ ముఠా ఇంటి వెనుక భాగం నుంచి పరారయ్యారు. వారంతా ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని, ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో పరారైనట్టు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో విచారణ ముమ్మరం చేశారు.
జల్లెడపడుతున్న పోలీసులు
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో సివిల్, టాస్క్‌ఫోర్సు పోలీసులతోపాటు 10 ప్రత్యేక బృందాలు నాలుగు రోజులుగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాతోపాటు పుణే, నేపాల్ సరిహద్దులల్లో జల్లెడపడుతున్నాయి. హత్యకేసులో సూత్రధారి కల్పన కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు పలు కీలక విషయాలను గుర్తించినట్టు తెలిసింది. కల్పన గతంలో బెంగళూర్‌లో తన భర్తతో కలిసి నివాసముండేదని గుర్తించిన పోలీసులు ఆ కోణంలో సైతం ఆరా తీశారు. ఈ క్రమంలో పలు వురిని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం నిందితుల వద్ద ఎలాంటి సెల్‌ఫోన్లు లేకపోవడంతో ముగ్గురిని పట్టుకోవడం కష్టంగా మారిందని తెలిసింది. నిందితులపై ప్రత్యేక నిఘావేసిన పోలీసు లు నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన మహారాష్ట్రలోని పుణేలో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి వెళ్లి విచారించడంతో ఆమె కనిపించలేదని, అయితే కల్పన తల్లిదండ్రులున్నారని తెలుసుకుని వారిని సైతం ప్రశ్నించారని తెలిసింది.
సాహుగ్యాంగ్ పనేనా..
నేపాల్‌కు చెందిన సాహు గ్యాంగ్ ఈ దోపిడీకి స్కెచ్ చేసి అమలు చేశారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ హత్యకు ఢిల్లీలోని జైలు నుంచే స్కెచ్ వేసినట్టు అంచనా వేశారు. నేపాల్, ముంబయి, పాట్నా నుంచి వచ్చిన పలువురు వ్యక్తులను కల్పనకు సాహు గ్యాంగ్ అటాచ్ చేసిందని పోలీసుల విచారణలో కనుగొన్నట్టు సమాచారం.
విశ్రాంత ఐపీఎస్ సతీమణి హత్యకేసులో పురోగతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



