Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి

బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని కమ్మర్ పల్లి మండల బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఏర్పాాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన, కేంద్ర మంత్రి కొడుకును ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆయన విమర్శించారు. పోస్కో కేసు నమోదైన చర్యలు తీసుకోకపోవడం భావ్యం కాదన్నారు. తక్షణమే బండి సంజయ్ కొడుకును  అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, సీనియర్ నాయకులు సుభాష్ గౌడ్, రెంజర్ల మహేందర్, కొత్తపల్లి రఘు, మల్కాయి రాజన్న, సుంకరి మురళి, బద్దం రాజేష్ రెడ్డి, నవాబ్ పాషా, కోరే నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -