Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ నాయకుల అవినీతి బండారం బయటపెడతాం

బీఆర్ఎస్ నాయకుల అవినీతి బండారం బయటపెడతాం

- Advertisement -

అభివృద్ధికి అడ్డుపడితే సహించం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి
నవతెలంగాణ-మిడ్జిల్ 

జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరులతో వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, బి ఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమీ లేదని, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో  లక్షల రూపాయలు అవనీతికి పాల్పడినారని, మాజీ మంత్రి అవినీతి నీ వెలికి తీసి ఆయన బండారాని బయటపెట్టి ప్రజల ముందు ఉంచుతామని  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్లికార్జున రెడ్డి, మహమ్మద్ గౌస్, మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ అన్నారు.

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి స్వగ్రాంలో మంగళవారం సర్పంచులు ధర్మానాయక్ , గోదా శ్రీశైలం యాదవ్, సువర్ణ తో కలిసి ఏర్పాటు చసిన  విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని , గత పాలకుల పరిపాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, చూసే ప్రజలు మిమ్ములను దూరం పెట్టారని పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మీరు చేసిన  అక్రమాలు, అవినీతిని వెలికి తీసి  మీ బండారాన్ని బయట పెట్టే వరకు  మిమ్ములను వెంటాడుతామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్,  భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మున్నూరు జంగయ్య, వెంకట శివప్రసాద్, మార్కెట్ డైరెక్టర్లు సత్యం, బంగారు, నాయకులు భాస్కర్ నాయక్, రాజేందర్ రెడ్డి, కృష్ణ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -