బాపురెడ్డి మరణం పార్టీకి తీరని లోటు

– దుబ్బాక ఎమ్మెలే రఘునందన్ రావు.
నవతెలంగాణ- రాయపోల్
బిజెపి గ్రామ అధ్యక్షులు గొర్రె బాపురెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు అని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో బాపురెడ్డి అంతక్రియలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండల పరిధిలోని మంతూర్ గ్రామంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు గొర్రె బాపురెడ్డి బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని, బిజెపి పార్టీకి తీరని లోటు అన్నారు. బాపురెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. అలాగే వారి కుటుంబానికి బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.కుటుంబ యజమాని మృతి చెందితే ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాయపోల్ మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి, కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం,బిజెపి సీనియర్ నాయకులు రాజా గౌడ్, గజ్వేల్ రామచంద్రం, రామ్ సాగర్ వెంకట్ గౌడ్, మంతుర్ ప్రభాకర్ రెడ్డి, కృష్ణ గౌడ్, నరేష్ గౌడ్, హరికృష్ణ గౌడ్, సమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love