నవతెలంగాణ – ముధోల్
బాసర కు చెందిన అధికార పార్టీ నాయకులు రైస్ మిల్ కు సంబంధించిన కేసులో సారంగాపూర్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సారంగాపూర్ మండలంలో ని ఓ గ్రామంలో రైస్ మిల్లు ను బాసర కు చెందిన నాయకులు నడిపిస్తున్నట్లు స్థానికంగా అంటున్నారు. ప్రభుత్వం రైస్ మిల్ కు ఇచ్చే ధాన్యాన్ని బియ్యం గా చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. అయితే లెక్క ప్రకారం సిఎంఆర్ ను అప్పజెప్పకపోవడంతో నాయకులపై సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంలో బాసర కు చెందిన పలువురు నాయకులను శనివారం రాత్రి పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. సదరు నాయకులు బాసర మండల రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. అయితే రైస్ మిల్లు ఘటనలో నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. వీరి అరెస్టును సారంగాపూర్ పోలీసులు కొద్దిసేపట్లో అధికారికంగా సమాచారం మీడియాకు తెలియజేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై బాసర ఎస్ హెచ్ ఓ అయిన సిఐ దీపక్ ను నవతెలంగాణ ఆదివారం ఫోన్ లో సంప్రదించగా సారంగాపూర్ పోలిసులు నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు తమకు తెలియదని చెప్పారు.
రైస్ మిల్ కేసులో బాసర నాయకులు.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



