ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ -ఆర్మూర్  

పకృతి పులకరించే ఆరాధించే పండుగ బతుకమ్మ అని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు.. పట్టణంలోని బ్రాహ్మణ పెళ్లి క్రాస్ రోడ్డులో గల ఆల్ ఫర్స్ నరేంద్ర పాఠశాలలో బతుకమ్మ ఉత్సవ సంబరాలను ఘనంగా ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండుగ బతుకమ్మ అని అన్నారు.. విద్యార్థులు ప్రదర్శించినటువంటి మా ఊరి బతుకమ్మ.. బంగారు బతుకమ్మ ..చిట్టి బతుకమ్మ… దసరా జాతర పోదాం నృత్యాలు చాలా ఆకర్షించాయి.. ప్రత్యేకంగా ప్రాంగణంలో నిర్వహించినటువంటి దసరా మహోత్సవ సంబరం అంబరాన్నంటింది.. ఈ కార్యక్రమంలో 1 50 మంది విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పాఠశాల పండగ వాతావరణాన్ని రెట్టింపు చేశారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్,, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు..
Spread the love