బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులు విడుదల.. ఆ ఇద్దరికి షాక్

నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెటర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంట్రల్‌ కాంట్రాక్టులను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. గత కొంతకాలంగా బోర్డుకు ఎదురెళ్తూ.. బీసీసీఐ ఆదేశాలను పెడచెవిన పెడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లకు భారీ షాక్‌ తప్పలేదు. ఈ ఇద్దరు క్రికెటర్లు సెంట్రల్‌ కాంట్రాక్టులు కోల్పోయారు. వీరితో పాటు టీమిండియా టెస్టు జట్టుకు ఆడే సీనియర్‌ క్రికెటర్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్‌ పుజారాలకూ కాంట్రాక్టులు దక్కలేదు. అయితే గతేడాది భారత క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి ఫ్యూచర్‌ స్టార్లుగా ఎదుగుతున్న యశస్వీ జైస్వాల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ వంటి యువ క్రికెటర్లకు బోర్డు పెద్దపీట వేసింది. టీమిండియా ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఏకంగా గ్రేడ్‌ బీ కాంట్రాక్టు దక్కించుకోగా గిల్‌.. ‘బీ’ నుంచి ‘ఏ’కు ప్రమోట్‌ అయ్యాడు.
గ్రేడ్‌ ఏ + : రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రిత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్‌ ఏ : రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్ధిక్‌ పాండ్యా
గ్రేడ్‌ బీ : సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వీ జైస్వాల్‌
గ్రేడ్‌ సీ : రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, ముఖేష్‌ కుమార్‌, సంజూ శాంసన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కెఎస్‌ భరత్‌, ప్రసిధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, రజత్‌ పాటిదార్‌
గ్రేడ్‌కు ఎంతంటే..!
ఏ+
గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘
’ కేటగిరీలోని క్రికెటర్లు రూ. 5 కోట్లు ఆర్జించనుండగా ‘బీ’ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్ల వేతనం దక్కుతుంది.
సీ’ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లు కోటి రూపాయల వేతనం పొందనున్నారు.

Spread the love