– ఎంపీడీవో లక్ష్మి కాంత్ రెడ్డి
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో లక్ష్మీ కాంత్ రెడ్డి అన్నారు. గురువారం రోజున మండలంలోని కస్లాబాద్ గ్రామంలో శానిటైజింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామాలలో మురికి కాలువలను శుభ్రపరుస్తూ గ్రామంలో సానిటైజింగ్ పనులను చేపడుతున్నామని ఇటీవల కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరప్రాంతాలలో నీటినినిల్వ ఉండకుండా చూసుకోవాలని, లేదంటే నీటిలో దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.నీటి ద్వారా వచ్చే వ్యాధులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లుఅధికంగావచ్చేప్రమా దం ఉన్నందునరద్దీగాఉండేప్రదేశాలకు వెళ్లొద్దన్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణ కోసం కాచివడబోసిన నీటినే తాగాలన్నారు. దోమలు దరిచేరకుండా దోమ నిరోధకాలు, దోమ తెరలు వాడాలని తెలిపారు, చిన్నపాటి జ్వరం వచ్చినా ఆసుప్రతికి వెళ్లి వెద్యులను సంప్రదించాలని కోరారు. సీజనల్ వ్యాదులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ జ్యోతి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.