ద్రాక్ష పండ్లను అందరూ ఇష్టంగా తింటారు. నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రాక్షని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ, ద్రాక్షను మామూలు నీటితో కడిగిన తర్వాత తిన్నా ప్రమాదమేనని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. సాధారణ నీటితో వీటిని కడిగితే వాటిపై ఉండే బ్యాక్టీరియా, కెమికల్స్ పోవని వైద్యులు చెబుతున్నారు.
వెనిగర్, బేకింగ్ సోడా కలిపిన నీటిలో పావు గంట సేపు ద్రాక్షని నానబెట్టాలి. ఆ తర్వాత మళ్లీ నాలుగైదుసార్లు నీటితో కడగాలి. ఆపై వీటిని టిష్యూ పేపర్స్‌పై కానీ లేదా.. మెత్తటి వస్త్రంపై వేసి బాగా ఆరనివ్వాలి. అవసరాలకు తగ్గట్టుగా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో అయినా పెట్టుకుంటే కొద్దిరోజులు తాజాగా ఉంటాయి. వీటి రుచిలో కూడా ఎటువంటి తేడా ఉండదు. ఇలా శుభ్రం చేసిన ద్రాక్షను తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.