మహిళా

ఈ సమాజానికి మహిళే ఒక ఆధారం
మన సష్టికి స్త్రీ ఒక శ్రీకారం,
అన్నీ తాను అయి
మన జీవితాలకు జీవన ప్రాకారమై
తరతరాలుగా సాగుతున్న స్ఫూర్తి

ఒక మనసుకు శ్రుతి అయి
జెత కలిసే సతి అయి
ఇల్లాలై,తల్లి అయి
అచ్చమైన సిరి అయి

కష్టం అయినా, సుఖమైనా
స్వాగతించే చెలి అవుతుంది
త్యాగం అవుతూ, స్వేదం అవుతూ
ప్రేమను పంచే ప్రేమ ధాత్రి అవుతుంది

ఆంక్షలు ఎన్ని ఎదురయినా
అడ్డుకట్టలు ఎన్ని ఎదురయినా
అవమానాలను ఎన్నింటినో దిగమింగి
గెలిచి సంకల్పం చాటుతుంది

బానిసలా చూస్తున్నా
భారమెంత వేస్తున్నా
ఆత్మశక్తితో, ధైర్యంతో
సాధించాలి అనే తపిస్తుంది

తను చదువుల నెలవై
పదవుల కొలువై
కల చెదరని నది అయి
వెను తిరగని తెగువై

తాను సాగింది
అంత ఎత్తైన శిఖరాన
స్వప్నాలే సాధించే
స్వేచ్ఛమైన సఖిలా
– దామెర్ల హష్మీ బాబు
7660057095
DYFI హైదబాద్‌ జిల్లా అధ్యక్షుడు

Spread the love