నవతెలంగాణ-మద్నూర్
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సభకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామ సభలో మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వ హాయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ముమ్మరంగా అందించడం జరుగుతుందని, ప్రజలకు రేషన్ కార్డులు వంటి పథకాలు ఎన్నో కొనసాగుతున్నాయని తెలిపారు. శాఖల వారీగా వివిధ శాఖల అధికారులు ప్రగతి ప్రణాళికను చదివి ప్రజలకు వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరీష్ కుమార్, గ్రామ ఉపసర్పంచ్ గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



