చండ్రుగొండ మండలంలో ఎలుగుబంటి కలకలం..

నవతెలంగాణ- ఖమ్మం: చండ్రుగొండ మండలం మద్డుకూరు గ్రామానికి చెందిన నల్లమతు రామారావుపై ఈ రోజు ఉదయం ఎలుగుబంటి దాడి చేసింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజూ లాగే రామారావు వాకింగ్ కు వెళ్ళి వస్తున్న క్రమంలో చెరువు కట్ట సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద ఈ సంఘటన జరిగింది. అప్రమత్తమైన ఫారెస్ట్ పోలీసు అధికారులు గాయాల పాలైన రామారావును విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గ్రామస్తులు తెలిపారు.

Spread the love