అంతర్జాతీయ వేదికపై మెరిసిన రాజులకొత్తపల్లి కవి వరిపల్లి అనిల్ కుమార్
ఘనంగా సన్మానించిన సాహితీ దిగ్గజాలు
నవతెలంగాణ-నెల్లికుదురు
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ప్రతిష్టాత్మకమైన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో మహబూబాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. నెల్లికుదురు మండలం, రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన యువ కవి వరిపల్లి అనిల్ కుమార్ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటి ‘ఉత్తమ కవిత అవార్డు’ కైవసం చేసుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచే కాకుండా, భారతదేశం నలుమూలల నుండి ప్రముఖ కవులు, రచయితలు, పరిశోధకులు మరియు సాహితీవేత్తలు హాజరైన ఈ మహాసభల్లో అనిల్ కుమార్ రాసిన కవితకు ఈ విశిష్ట పురస్కారం లభించింది. శనివారం జరిగిన ఘనమైన సభలో దేశ విదేశాల సాహితీ దిగ్గజాల సమక్షంలో ఆయనకు ఈ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.
జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి..
ఎందరో లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలు పాల్గొన్న ఈ ప్రపంచ స్థాయి వేదికపై మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం మరియు రాజులకొత్తపల్లి గ్రామం పేరును నిలబెట్టడం పట్ల జిల్లా ప్రజలు, సాహితీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నా పూర్వజన్మ సుకృతం: వరిపల్లి అనిల్ కుమార్ ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అనిల్ కుమార్ మాట్లాడుతూ.”ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ వేదికపై మన ప్రాంతం పేరును చాటిచెప్పే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, నా వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, నా గ్రామ ప్రజలకు మరియు శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.”అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించి జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన వరిపల్లి అనిల్ కుమార్‌కు గ్రామ ప్రజలు, మండల ప్రజాప్రతినిధులు, కవులు మరియు పలువురు సాహితీ అభిమానుల కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ సాహిత్య మహాసభల్లో జిల్లా యువకుడికి ‘ఉత్తమ కవిత అవార్డు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



