సైబర్‌ నేరాలపై జాగ్రత్త వహించాలి: ఎస్సై తిరుపతి

నవతెలంగాణ – కోహెడ
సైబర్‌ నేరాలపై ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్సై సిహెచ్‌.తిరుపతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌ వద్ద గ్రామస్థులకు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పలువురు సైబర్‌ నేరస్థులు ఫోన్‌ చేసి తమ ఏటీఎం సంబంధిత వివరాలు తెలపాలని, బ్యాంక్‌ నుండి ఫోన్‌ చేస్తున్నామని వివరాలను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారి భారిన పడి మోసపోవద్దని సూచించారు. అలాగే సెల్‌ ఫోన్స్‌ అవసరం మేరకు ఉపయోగించాలని, ప్రజలు సైబర్‌ నేరాలకు గురికావద్దని, తెలియని వ్యక్తులు నుంచి వచ్చే మెసేజ్‌లకు రెస్పాండ్‌ కావద్దని, బ్యాంక్‌ అధికారులము అంటు ఎవరైన ఫోన్‌ చేసి అకౌంట్‌ వివరాలూ అడిగితే చెప్పవద్దని సూచించారు. ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా చెప్పాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు గురై కుటుంబాలను రోడ్డున వేయవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు మండలంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్య తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్‌లకు వాహనాలను తల్లిదండ్రులు అప్పగించవద్దని, ప్రమాదం జరిగితే కుటుంబం ఇబ్బందులకు గురవుతుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌లు లింగారెడ్డి, లక్ష్మణ్‌, కానిస్టేబుల్‌లు సిహెచ్‌.రమేష్‌, రమేష్‌ నాయక్‌, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love