మత్తుబాబులూ.. జర జాగ్రత్త

నవతెలంగాణ హైదరాబాద్: నయాసాల్‌ వేడుకల నేపథ్యంలో డిసెంబరు 31(ఆదివారం) రాత్రి 8 గంటల నుంచే డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు చేస్తామని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ ఎం.విశ్వప్రసాద్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సైఫాబాద్‌, బేగంపేట్‌ తదితర చోట్ల ఐదు బృందాలు ఉంటాయన్నారు. ఈ ఏడాది తొలిసారి డ్రంకన్‌డ్రైవ్‌ తరహాలో టీఎస్‌న్యాబ్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రత్యేక కిట్స్‌తో అనుమానితుల మూత్ర నమూనా తీసుకొని 5 నిమిషాల్లో వారు డ్రగ్స్‌ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారిస్తారు. డ్రంకన్‌డ్రైవ్‌, డ్రగ్స్‌ పరీక్షల్లో దొరికిన వారు వేడుకలకు వెళ్లిన వేదికల నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Spread the love