వీగిపోయిన అవిశ్వాసం

నవతెలంగాణ – సూర్యాపేట
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై నిఖిల దిలిప్ రెడ్డి వర్గ్యులు పెట్టిన  అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసా తీర్మానం వీగిపోయినట్లు కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు. అవిశ్వాసా తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32  మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వర్గ్యులలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయిందని కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు. కాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉరఫ్ వకిల్ సాబ్ పాచిక నెరవేరింది.

Spread the love