Thursday, May 14, 2026
E-PAPER
Homeబీజినెస్భారతీ ఎయిర్‌టెల్‌‌కు 
రూ.7,325 కోట్ల లాభాలు

భారతీ ఎయిర్‌టెల్‌‌కు 
రూ.7,325 కోట్ల లాభాలు

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కో కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 16 శాతం పతనంతో రూ.7,325 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.11,022 కోట్ల లాభాలు సాధించింది. మరోవైపు గడిచిన క్యూ4లో కంపెనీ ఆదాయం 15.6 శాతం వృద్ధితో రూ. 55,383.2 కోట్లకు చేరుకోవడం విశేషం. మొత్తం 2025-26 గాను ఎయిర్‌టెల్ లాభం 20.4 శాతం తగ్గి రూ. 26,695 కోట్లుగా నమోదైనప్పటికీ, వార్షిక ఆదాయం మాత్రం 21.9 శాతం వృద్ధిని కనబరిచింది.
టెలికాం రంగంలో కీలకమైన సగటు వినియోగదారు ఆదాయం (ఎఆర్‌‌పియు) రూ. 245 నుండి రూ. 257కు పెరిగింది. ఈ ఏడాదిలో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 65 కోట్ల మార్కును దాటడంతో పాటు, క్లౌడ్ సేవలు. రుణ వ్యాపారం వంటి కొత్త విభాగాల్లోకి ప్రవేశించి తన వ్యాపారాన్ని మరింత విస్తరించినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గొపాల్ విఠల్ పేర్కొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -