క్రీడా పాత్రికేయుల కృషి భేష్‌

Sports journalists work hard– హైదరాబాద్‌ పీసీ సీవీ ఆనంద్‌ ప్రశంస
నవతెలంగాణ-హైదరాబాద్‌: క్రీడా రంగం అభివృద్దిలో స్పోర్ట్స్‌ పాత్రికేయుల పాత్ర విలువైనదని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి తెలియజేయటంలో జర్నలిస్ట్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డారు. సీవీ ఆనంద్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన ఎస్‌జేఏటీ ప్రతినిధులు స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ తెలంగాణ (ఎస్‌జేఏటీ) 2025 వార్షిక డైరీని ఆయనకు అందజేశారు. ఏడాదిలో జరిగే ముఖ్యమైన క్రీడా ఈవెంట్లు, క్రీడా సంఘాల సమాచారంతో డైరీని రూపొందించిన ఎస్‌జేఏటీని ఆయన అభినందించారు. ఎస్‌జేఏటీ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌ దాస్‌ మంతటి, ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌బి సంజరు, సంయుక్త కార్యదర్శి చెగ్గోజు రాజశేఖర్‌ సహా ఈసీ సభ్యులు సతీశ్‌ గౌడ్‌, మహేశ్‌ గౌడ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love