నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ 5వ వార్డులో గల కోటార్మూర్ హనుమాన్ మందిరం పునర్నిర్మాణ పనులకు ఆదివారం కోటార్మూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హనుమాన్ మందిర పునర్నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో కోటార్మూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఇట్టేడి గంగారెడ్డి-ప్రమీల రెడ్డి దంపతులు వేద పండితుల సమక్షంలో వేద మంత్రోచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటార్ మూర్ హనుమాన్ మందిర పునర్నిర్మాణ పనులకు సుమారు 50 లక్షల వరకు నిధులు అవసరమున్నాయని వీడీసీ సభ్యులు పేర్కొన్నారు. మందిర పునర్నిర్మాణ పనులకు దాతలు విరివిగా విరాళాలు ఇస్తున్నట్లు చెప్పారు. మందిర పునర్నిర్మాణ పనులకు తీగల నర్సారెడ్డి, శాయంపేట్ అనిల్ గౌడ్, తొగర్ల టవర్ రవి, నక్క నరసయ్య, లోక సుదర్శన్ రెడ్డి తదితరులు ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చారన్నారు. త్వరలోనే హనుమాన్ మందిరం పునర్నిర్మాణ పనులు ప్రారంభం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ కోశాధికారి తిరుపతి గౌడ్,కార్యదర్శి గడ్డి కార్తిక్ కార్యవర్గ సభ్యులు గోపిడి సంజీవ్ రెడ్డి, లక్కారం మదన్, ఆరే లింబాద్రి, కనక రాజ గంగారం, కుంట విద్యాసాగర్ గౌడ్, సరుకుల వీరయ్య, సాంబారు స్వామి, దొంగ మట్టి శ్రీకాంత్, నక్క మహేష్, అటెండర్ నక్క సాయన్న, గ్రామస్థులు ఆరె రమేష్, షేర్ల సాయ గౌడ్,లక్కారం పెద్ద నారాయణ, కచ్చ కాయల రవి, గడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.