బిగ్‌ సీలో సంక్రాంతి ఆఫర్లు

బిగ్‌ సీలో సంక్రాంతి ఆఫర్లుహైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ సీ సంక్రాంతి పండుగ సందర్బంగా వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. తమ 250కి పైగా స్టోర్లలో మొబైల్‌ కొనుగోళలపై రూ.3,000 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌తో పాటు రూ.4,999 విలువగల స్మార్ట్‌ వాచ్‌ను ఉచితంగా అందిస్తున్నామని బిగ్‌సీ ఫౌండర్‌, సీఎండీ యం బాలు చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.1,10,000 విలువగల హెల్త్‌కేర్‌కు సంబంధించిన ప్రయోజనాలను ఉచితంగా లభిస్తాయన్నారు. ప్రతీ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ టీవీ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి సహా క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చన్నారు. ఐఫోన్‌ మొబైల్‌ కొనుగోలుపై రూ.4,000 వరకు, వన్‌ప్లస్‌, రియల్‌మీ మొబైల్స్‌ కొనుగోళ్లపై రూ.3,000 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నామన్నారు. ఈ సంక్రాంతికి తాము అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవాలని బాలు చౌదరి కోరారు.

Spread the love