నగరంలో రెండు బర్గర్‌ మ్యాన్‌ కేఫ్‌ల ఏర్పాటు

హైదరాబాద్‌ : ఇండియన్‌ బర్గర్‌ బ్రాండ్‌ అయినా బర్గర్‌మ్యాన్‌ హైదరాబాద్‌లో రెండు కొత్త కేఫ్‌లను ప్రారంభించింది. ఒకటి బంజారాహిల్స్‌లో మరొకటి మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది. తెలంగాణలో మొదటి రెండు కేఫ్‌లు ఇవేనని బర్గర్‌మ్యాన్‌ సిఇఒ సునీల్‌ చెరియన్‌ తెలిపారు. తాజా కేఫ్‌లతో దేశంలో 20 సెంటర్లకు విస్తరించినట్లయ్యిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మరో 30 స్టోర్లను తెరవాలని ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. ఇందుకోసం రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామన్నారు.

Spread the love