Thursday, May 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కొత్త ఆసరా పింఛన్లపై బిగ్ అప్‌డేట్..

కొత్త ఆసరా పింఛన్లపై బిగ్ అప్‌డేట్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్లచెరువులో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పింఛన్ల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తీపికబురు చెబుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు. మంత్రి తాజా ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -