నీరు ఒకే చోట నిల్వ ఉంటే కొంతకాలం తర్వాత మురుగుగా మారిపోతుంది. దోమలకు ఆవాస కేంద్రంగా మారుతుంది. అదే నీరు నిరంతరం పారుతూ ఉంటే స్వచ్ఛతను కలిగి ఉంటుంది. నలుగురికీ ఉపయోపగడుతుంది. సమాజం కూడా అంతే. ఉన్నస్థితి నుంచి మరో స్థితికి మారడం ఆవశ్యకం. అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే మార్పు అనివార్యం. సైన్స్ నొక్కివక్కాయించి చెబుతున్నదీ అదే. సమాజం యధాస్థితిలోనే ఉండాలంటే అది మూర్ఖత్వమే అవుతుంది. బీజేపీ నేతలు మాత్రం ఎన్కటి కాలానికి పోవాలనీ, మనువాదాన్ని అనుసరించాలని పదేపదే వళ్లిస్తున్నారు. కానీ, అదే పార్టీకి చెందిన నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నోటినుంచి ఉన్నట్టుగా ‘శాస్త్రీయ దృక్పథాన్ని యువత పెంపొదించుకోవాలి. మానవ జీవన పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయాలి’ అనే అణిముత్యాలు జారిపడ్డాయి. జీవ పరిణామ క్రమాన్ని వ్యతిరేకించే..మనువాదాన్ని కోరుకునే మీ నేతలకూ గీదానిపైనే ఓ క్లాసు చెప్పరాదు సారూ. సైన్స్ ప్రచారకులపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నవారిని మందలించండి సారూ.
– అచ్చిన ప్రశాంత్