చల్మడ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరిక ..

– పేద ప్రజల నడ్డి విరిసిన బీజేపీ, బీఆర్ఎస్ కి ఓటు వేసి మోసపోవద్దు..
నవతెలంగాణ -మునుగోడు
గత పది సంవత్సరాలుగా పేద ప్రజల నడ్డి విచ్చే విధంగా ధరలను పెంచిన  కేంద్రంలో , రాష్ట్రంలో పాలించిన బీజేపీ, బీఆర్ఎస్ కు ఎన్నికలలో ఓటు వేసి మోసపోవద్దని కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గం అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు . ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని చల్మడ గ్రామానికి చెందిన బిజెపి , బిఆర్ఎస్ నాయకులు పగిళ్ల కృష్ణ , కొంక చిన్న శంకర్ , కర్నాటి శశిధర్  మండల కేంద్రంలోని కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయం లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టే అని ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో తిట్టుకుంటూ ఢిల్లీలో కలుసుకుంటున్నాయని పేర్కొన్నారు.నేను ఆ పార్టీలోకి వెళ్లిన ఈ పార్టీలోకి వచ్చిన నా ఏకైక లక్ష్యం కేసిఆర్ కుటుంబ పాలనను గద్దె దించడమే అని అన్నారు. కొంక చంద్రయ్య , కొంక రాము , కర్నాటి మల్లికార్జున్ తదితరులు ఉన్నారు..

Spread the love