కళ్లకు గంతలు కట్టుకొని కార్మికుల విన్నుతో నిరసన

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. గురువారం కార్మికులు కళ్ళకు గంతలు కట్టుకొని వినుత నిరసన చేపట్టారు. గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు దుర్గయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె విరమిచేది లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు శ్రీనివాస్ ,మామిడి సంపత్, తాడూరి లక్ష్మి, వెంకటేశం,కాసర్ల సదానందం, నాగరాజు, కార్తీక్ నరసవ్వ, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Spread the love