ఢిల్లీ – దుబాయ్‌ విమానానికి బాంబు బెదిరింపులు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపులు  కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో దుబాయ్‌కి వెళ్లేందుకు విమానం ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో సిద్ధంగా ఉంది. మరికాసేపట్లో టేకాఫ్‌ అవుతుందనంగ.. ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ లిమిటెడ్‌ ఆఫీస్‌, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కి విమానంలో బాంబు ఉందంటూ కొందరు వ్యక్తులు బెదిరింపు మెయిల్‌ పంపినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం తెలిపారు. విమానంలో బాంబు ఉందంటూ మెయిల్‌ చేసినట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్‌తో ప్రొటోకాల్‌ ప్రకారం.. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదని వెల్లడించారు.

Spread the love